Thursday, February 21, 2008

సొమ్ములు కన్నా సంసారమే మిన్న!

అవసరమైతే విలాసాలు త్యాగం దంపతుల్లో ఒకరి ఉద్యోగం చాలు 95 శాతం హైదరాబాదీల అభిప్రాయం ఇదే న్యూఢిల్లీ: సంతృప్తికరమైన వివాహ జీవితం కోసం ఉద్యోగాలు చేసే దంపతుల్లో ఒకరు దాన్ని విడిచిపెట్టడానికీ, విలాసాలను తగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ కోసం సైనోవేట్ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాల్లోని కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న జంటలపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 52 శాతం మంది తమకు అవకాశమొస్తే ఇంట్లో ఒకరే ఉద్యోగం చేస్తూ, సంతృప్తికరమైన వివాహ బంధానికి, తక్కువ విలాసాలకు మొగ్గు చూపుతామని పేర్కొన్నారు. 48 శాతం మాత్రం తమకు విలాసవంతమైన జీవితం కావాలని, అందుకే ఇద్దరం పనిచేస్తామని తేల్చి చెప్పారు. నగరాలపరంగా చూస్తే ఢిల్లీ, పుణేవాసులు విలాసవంతమైన జీవనానికి మొగ్గు చూపగా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయివాసులు ఒకే జీతానికి, ఆనందకర వివాహ జీవితానికి అనుకూలంగా స్పందించారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో 95 శాతం మంది ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో 87 శాతం మంది తమ సంసారం సాఫీగానే కొనసాగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఒకరితో మరొకరు విలువైన సమయాన్ని గడపడం, కార్యాలయానికి ప్రయాణం తదితర విషయాల్లో గొడవలు జరగడమూ సాధారణమేనని 56 శాతం మంది పేర్కొంటున్నారు. రెండు జీతాలు వచ్చే కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తి చివరకు అవి విడాకులకు దారి తీసే అవకాశాలున్నాయని 34 శాతం మంది తెలిపారు.
(ఈనాడు నుంచి ...)

Monday, December 17, 2007

సాగు భూములు అమ్ముకోవద్దు: కలాం

పుణె: 'సారవంతమైన మీ పొలాలను సెజ్‌లు, ఆర్థిక కార్యకలాపాలకు విక్రయించవద్దు'...
దేశంలోని రైతులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచన ఇది! ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటును స్వాగతిస్తూనే... రైతుల పొలాలను డబ్బిచ్చి తీసుకునే బదులు వీటిలో కర్షకులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు। మార్కెట్‌లో పొలం విలువను లెక్కించి దానికి సమాన వాటాను రైతులకు సెజ్‌ల్లో కల్పించాలని కోరారు. పుణెలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 'ఏ రైతునైనా భూమి లేనివారిగా నేను చూడలేను. అన్నదాత కుటుంబంనుంచి వచ్చినందున పొలం విలువేమిటో నాకు తెలుసు' అని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. రైతులు, వారి బిడ్డలకు సెజ్‌ల నిర్వహణలో కీలక పాత్ర కల్పించాలని అన్నారు. పుణెలో రూ.4 వేలకోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 'మగర్‌పట్ట'లో 120మంది రైతులకు భాగం కల్పించినందుకు దాని యాజమాన్యాన్ని కలాం అభినందించారు. దేశంలో సెజ్‌ల ఏర్పాటులో ఇది ఉదాహరణగా నిలవాలని ఆకాంక్షించారు.
(ఈనాడు సౌజన్యంతో...! ఈరోజు నాకు బాగా నచ్చిన వార్త.)

Wednesday, March 22, 2006

Truth Happens


Despite ignorance, ridicule, and opposition, truth happens. Open source continues to revolutionize the industry. Everyday, someone around the world chooses a proprietary solution restricted by patents, copyrights, and trademarks. At the same time, someone else around the world learns of open source and adopts its innovative, compelling technology.
Real Video [3mins 30 Secs]

Sunday, March 19, 2006

Video of Hyderabad International Airport..!

A new nice video about our upcoming Hyderabad new international airport

http://video.google.com/videoplay?docid=3632227484430610051&q=Hyderabad+airport

Thank you!
--రాజ మల్లేశ్వర్

మా తెలుగుతల్లి!!

మా తెలుగు తల్లికిమల్లెపూదండ
మా కన్నతల్లికి మంగళారతులు
కడుపులో బంగారు, కనుచూపులోకరుణ
చిరునవ్వులో సిరులుదొరలించు మాతల్లి

గలగలా గోదారి కదలిపోతుంటేను
బిరబిరా కృష్ణమ్మపరుగులిడుతుంటేను
బంగారు పంటలేపండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి

అమరావతి నగరి అపురూపశిల్పాలు
త్యాగయ్య గొంతులోతారాడునాదాలు
తిక్కయ్య కలములోతియ్యందనాలు
నిత్యమైనిఖిలమైనిలిచియుండేదాక

రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మపతిభక్తి
తిమ్మరుసు ధీయుక్తి,కృష్ణరాయలకీర్తి
మా చెవుల రింగుమనిమారుమ్రోగేదాక
నీ పాటలే పాడుతాం, నీఆటలేఆడుతాం
జై తెలుగుతల్లీ జైతెలుగుతల్లీ

-శంకరంబాడి సుందరాచార్య

Saturday, March 18, 2006

స్వాగతం..!

Finally I got it...!!

తెలుగు లో రాద్దాం రండి!!