Wednesday, April 22, 2009

శ్రీ రామవర్మ గారు పాడిన "ఎందరోమహానుభావులు..."

శ్రీ రామవర్మ గారు, ప్రఖ్యాత చిత్రకారులు రాజా రవివర్మ గారి మనుమలు.
వారు రాష్ర్టపతి భవన్ లో గౌ|| శ్రీ కలాం గారి సమక్షంలో పాడిన "ఎందరోమహానుభావులు..." ,

ఎందరోమహానుభావులు...1


ఎందరోమహానుభావులు...2


ఎందరోమహానుభావులు...3

Monday, February 23, 2009

అమెరికా కి ఏమైంది, మనకేం కాబోతోంది?


"ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక సంక్షోభం -- డాలర్ దుష్ప్రభావం" మీద భారతం నుంచి ఒక ఎకానమిస్ట్ సాధికారంగా మాట్లాడిన వీడియో. మనలో చాల మందికి తెలిసిన విషయాలే కావొచ్చు, కాని కొన్ని విషయాలు చాల భయంకరంగా ఉన్నాయ్. ఒకసారి తప్పని సరిగా చూడదగిన(వినదగిన) వీడియో!
http://video.google.com/videoplay?docid=4343898391323537541

Another Controversial "Amero Conspiracy" , but interesting...!
http://www.youtube.com/watch?v=jj2oC64NSIA

Saturday, September 13, 2008

LHC

Following video is having more technical details for Large Hadron Collider (LHC)


Thursday, February 21, 2008

సొమ్ములు కన్నా సంసారమే మిన్న!

అవసరమైతే విలాసాలు త్యాగం దంపతుల్లో ఒకరి ఉద్యోగం చాలు 95 శాతం హైదరాబాదీల అభిప్రాయం ఇదే న్యూఢిల్లీ: సంతృప్తికరమైన వివాహ జీవితం కోసం ఉద్యోగాలు చేసే దంపతుల్లో ఒకరు దాన్ని విడిచిపెట్టడానికీ, విలాసాలను తగ్గించుకోవడానికి సిద్ధపడుతున్నట్లు తాజా సర్వేలో తేలింది. టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ కోసం సైనోవేట్ అనే అంతర్జాతీయ అధ్యయన సంస్థ ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, పుణె, హైదరాబాద్ నగరాల్లోని కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్న జంటలపై ఈ సర్వేను నిర్వహించింది. ఇందులో 52 శాతం మంది తమకు అవకాశమొస్తే ఇంట్లో ఒకరే ఉద్యోగం చేస్తూ, సంతృప్తికరమైన వివాహ బంధానికి, తక్కువ విలాసాలకు మొగ్గు చూపుతామని పేర్కొన్నారు. 48 శాతం మాత్రం తమకు విలాసవంతమైన జీవితం కావాలని, అందుకే ఇద్దరం పనిచేస్తామని తేల్చి చెప్పారు. నగరాలపరంగా చూస్తే ఢిల్లీ, పుణేవాసులు విలాసవంతమైన జీవనానికి మొగ్గు చూపగా, హైదరాబాద్, బెంగళూరు, ముంబయివాసులు ఒకే జీతానికి, ఆనందకర వివాహ జీవితానికి అనుకూలంగా స్పందించారు. ముఖ్యంగా హైదరాబాదీల్లో 95 శాతం మంది ఈ విధంగా స్పందించడం గమనార్హం. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్న దంపతుల్లో 87 శాతం మంది తమ సంసారం సాఫీగానే కొనసాగుతుందని చెబుతున్నారు. అదే సమయంలో ఒకరితో మరొకరు విలువైన సమయాన్ని గడపడం, కార్యాలయానికి ప్రయాణం తదితర విషయాల్లో గొడవలు జరగడమూ సాధారణమేనని 56 శాతం మంది పేర్కొంటున్నారు. రెండు జీతాలు వచ్చే కుటుంబాల్లో అభిప్రాయ భేదాలు తలెత్తి చివరకు అవి విడాకులకు దారి తీసే అవకాశాలున్నాయని 34 శాతం మంది తెలిపారు.
(ఈనాడు నుంచి ...)

Monday, December 17, 2007

సాగు భూములు అమ్ముకోవద్దు: కలాం

పుణె: 'సారవంతమైన మీ పొలాలను సెజ్‌లు, ఆర్థిక కార్యకలాపాలకు విక్రయించవద్దు'...
దేశంలోని రైతులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచన ఇది! ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటును స్వాగతిస్తూనే... రైతుల పొలాలను డబ్బిచ్చి తీసుకునే బదులు వీటిలో కర్షకులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు। మార్కెట్‌లో పొలం విలువను లెక్కించి దానికి సమాన వాటాను రైతులకు సెజ్‌ల్లో కల్పించాలని కోరారు. పుణెలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 'ఏ రైతునైనా భూమి లేనివారిగా నేను చూడలేను. అన్నదాత కుటుంబంనుంచి వచ్చినందున పొలం విలువేమిటో నాకు తెలుసు' అని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. రైతులు, వారి బిడ్డలకు సెజ్‌ల నిర్వహణలో కీలక పాత్ర కల్పించాలని అన్నారు. పుణెలో రూ.4 వేలకోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 'మగర్‌పట్ట'లో 120మంది రైతులకు భాగం కల్పించినందుకు దాని యాజమాన్యాన్ని కలాం అభినందించారు. దేశంలో సెజ్‌ల ఏర్పాటులో ఇది ఉదాహరణగా నిలవాలని ఆకాంక్షించారు.
(ఈనాడు సౌజన్యంతో...! ఈరోజు నాకు బాగా నచ్చిన వార్త.)