Monday, December 17, 2007

సాగు భూములు అమ్ముకోవద్దు: కలాం

పుణె: 'సారవంతమైన మీ పొలాలను సెజ్‌లు, ఆర్థిక కార్యకలాపాలకు విక్రయించవద్దు'...
దేశంలోని రైతులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచన ఇది! ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటును స్వాగతిస్తూనే... రైతుల పొలాలను డబ్బిచ్చి తీసుకునే బదులు వీటిలో కర్షకులకు భాగస్వామ్యం కల్పించాలని సూచించారు। మార్కెట్‌లో పొలం విలువను లెక్కించి దానికి సమాన వాటాను రైతులకు సెజ్‌ల్లో కల్పించాలని కోరారు. పుణెలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొన్నారు. 'ఏ రైతునైనా భూమి లేనివారిగా నేను చూడలేను. అన్నదాత కుటుంబంనుంచి వచ్చినందున పొలం విలువేమిటో నాకు తెలుసు' అని మాజీ రాష్ట్రపతి పేర్కొన్నారు. రైతులు, వారి బిడ్డలకు సెజ్‌ల నిర్వహణలో కీలక పాత్ర కల్పించాలని అన్నారు. పుణెలో రూ.4 వేలకోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 'మగర్‌పట్ట'లో 120మంది రైతులకు భాగం కల్పించినందుకు దాని యాజమాన్యాన్ని కలాం అభినందించారు. దేశంలో సెజ్‌ల ఏర్పాటులో ఇది ఉదాహరణగా నిలవాలని ఆకాంక్షించారు.
(ఈనాడు సౌజన్యంతో...! ఈరోజు నాకు బాగా నచ్చిన వార్త.)

No comments: